Nancy Pelosi Taiwan Visit: అమెరికా ప్రతినిధుల సభ్య స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్ పర్యటన అమెరికా, చైనాల మధ్య అగ్గిరాజేసింది. పెలోసీ పర్యటనను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే నిప్పులో చెలగాటమాడుతున్నారని అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది. అయినా వీటన్నింటిని పట్టించుకోకుండా బుధవారం నాన్సీ పెలోసీ తైవాన్ ను సందర్శించారు. ఇదిలా ఉంటే ఆమె పర్యటనపై రష్యా స్పందించింది. పెలోసీ పర్యటన ఉద్రిక్తతలను పెంచే విధంగా ఉందని.