Luna-25: చంద్రయాన్-3, అంతరిక్ష రంగంలో భారత కీర్తిపతాకాన్ని రెపరెపలాడించింది. ఎవరికి సాధ్యం కాని చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్‌ని విజయవంతంగా దించింది. చంద్రుడిపై ఇలా ల్యాండర్, రోవర్లని దించిన నాలుగో దేశంగా, దక్షిణ ధృవంపై దిగిన మొదటి దేశంగా కీర్తిగడించింది. అంతకుముందు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే చంద్రుడిపై ల్యాండర్లను దించాయి.