మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ జోరు పెంచేసింది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ వేగం పెంచారు చిత్ర బృందం. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సైతం అంచనాలను పెంచుకొంటూ వస్తున్నాయి. ఇంకా నాటు నాటు సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గానే ఉండగా.. మూడో పాటకు ముహూర్తం పెట్టారు…
రిలీజ్ డేట్ ప్రకటించటమే ఆలస్యం ‘ఆర్ఆర్ఆర్’ ప్రచారంలో వేగం పెరిగింది. ఇటీవల విడుల చేసిన రెండో పాట సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న రిలీజ్ కాబోతోంది. రెండో పాటతో ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించిన జక్కన్న మూడో పాటకు ముహూర్తం పెట్టాడట. ఈ నెల 24న మూడో పాటను విడుదల చేయబోతున్నాడట. ఈ పాట రిలీజ్ డేట్ తో పాటు టైమ్ ను…