సౌత్ సిల్వర్ స్క్రీన్ మీద ఒకప్పుడు వెలుగు వెలిగిన ఆర్కే రోజా తరువాత రాజీకీయాల్లో బిజీ అయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నారు. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న రోజా, ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్‌ను తమిళ చిత్ర పరిశ్రమలో చాలా పవర్‌ఫుల్‌గా మొదలుపెట్టారని తెలుస్తోంది. కేవలం ఒక సినిమాతోనే ఆగకుండా, వరుసగా క్రేజీ ప్రాజెక్టులకు సంతకం చేస్తూ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారారు రోజా. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత…