Rishabh Pant Injury Viral Video: మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు తీవ్ర గాయం అయింది. మొదటి రోజు మూడో సెషన్‌లో బ్యాటింగ్ చేస్తుండగా అతడి కాలికి గాయం అయింది. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో పంత్ స్వీప్ షాట్ ఆడాడు. బంతి ముందుగా బ్యాట్ ఎడ్జ్‌కు తగిలి.. ఆపై పంత్ కుడి కాలు పాదానికి బలంగా తాకింది. దాంతో నొప్పితో విలవిల్లాడాడు. నొప్పి భరించలేక కాసేపు మైదానంలో…