బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అతని ప్రేయసి రియా చక్రవర్తిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్ కేసులో ఆమె పేరు బయటకు వచ్చింది. దీంతో రియా, ఆమె సోదరుడిని అధికారులు అరెస్ట్ చేయడంతో, ఒక దశలో ఆమె జీవితం తారుమారై పోయింది. సుశాంత్ కుటుంబం ఫిర్యాదుతో మొదలైన ఈ కేసు తర్వాత ఈడీ, ఎన్సీబీ, చివరకు సీబీఐ దర్యాప్తు చేసింది. అనేక ఆరోపణలు…