తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఇవాళ ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు వచ్చే వెహికిల్స్ ను పోలీసులు అడ్డుకోవడంపై రేవంత్ రెడ్డి డీజీపీతో మాట్లాడారు. సుమారు 1700 వాహనాలను సీజ్ చేశారని ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఖమ్మం సభకు వాహనాలు రాకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని రేవంత్ రెడ్డి డీజీపీ అంజనీ కుమార్ దృష్టికి తీసుకు వెళ్లారు.
తెలంగాణలో ఖమ్మం వేదికగా కాంగ్రెస్ పార్టీ నేడు జనగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ బహిరంగ సభకు హాజరుకానున్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరనున్నారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఖమ్మం జిల్లాలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాటు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మధుయాష్కిలు ఉన్నారు. వచ్చే నెల 2వ తారీఖున ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్న భట్టి పాదయాత్ర ముగింపు సభకు కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ రాకతో వీరి సమావేశానికి ఆసక్తి నెలకొంది.
తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రేపు (గురువారం) ఖమ్మం జిల్లాకు వెళ్లనున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ ముగింపు సందర్భంగా వచ్చే నెల 2వ తారీఖున ఇక్కడ సభ నిర్వహణ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈసారి కూడా అధికారంలోకి రాకపోతే చాలామంది రాజకీయ జీవితాలు దెబ్బతీంటాయని ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మధ్యాహ్నం జరిగే కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశానికి జగ్గారెడ్డి హాజరుకానున్నారు. చిన్న పిల్లల చేష్టలుగా వ్యవహరిస్తే మరింత నష్టం జరుగుతుందని అన్నారు.