కంపెనీ ఐదు రోజుల రిటర్న్-టు-ఆఫీస్ (RTO) పని విధానాన్ని పునఃపరిశీలించాలని ఉద్యోగులు చేసిన వినతులను జేపీ మోర్గాన్ చేజ్ సీఈవో జామీ డిమోన్ తిరస్కరించారు. ఉద్యోగులు వేసిన అంతర్గత పిటిషన్‌ను అతడు తోసిపుచ్చారు. దానిపై సమయం వృథా చేయకండి.. ఆ ఫకింగ్ పిటిషన్‌పై ఎంత మంది సంతకం చేశారనేది నాకు ముఖ్యం కాదు అని చెప్పుకొచ్చారు.
Amazon: కోవిడ్ మహమ్మారి సమయంలో పలు కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్(WFH) సదుపాయాన్ని కల్పించాయి. ముఖ్యంగా టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి దగ్గర నుంచే పనిచేయాల్సిందిగా కోరాయి. అయితే కరోనా ప్రభావం తగ్గి దాదాపుగా రెండేళ్లు అవుతోంది. ఈ క్రమంలో చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానాన్ని ఎత్తేస్తున్నాయి.