తమిళ హీరో శింబుకు ఊరట కల్పించింది నిర్మాతల మండలి. ఈ హీరో కెరీర్ ప్రారంభం నుండి వివాదాలలో చిక్కుకుంటూనే ఉన్నాడు. కొంతమంది నిర్మాతలు, సాంకేతిక నిపుణులతో ఆయన గొడవ చివరికి తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వరకూ చేరుకొని అక్కడ నుండి రెడ్ కార్డ్ నిషేధానికి దారి తీసింది. గతంలో శింబు ప్రధాన పాత్రలో “అన్బాధవన్ అసరదావన్ అడంగాదవన్” అనే సినిమా సమయంలో ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈ సినిమాను తెరకెక్కించిన నిర్మాత మైఖేల్ రాయప్పన్…