ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అవతరించింది. మంగళవారం అహ్మదాబాద్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫైనల్‌లో ముందుగా ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి రన్నరప్‌గా నిలిచింది. చివరి ఓవర్ నుంచే ఆర్సీబీ గెలుపు సంబరాలు మొదలయ్యాయి. ఆర్సీబీ, విరాట్ కోహ్లీ నామస్మరణతో…