ఆరెంజ్ ఆర్మీ ముద్దుగా వార్నర్ భాయ్ అని పిలుచుకునే సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ గత ఐపీఎల్ సీజన్ లో పేలవ ఆటతీరుకు తోడు నాయకత్వ వైఫల్యాలతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో స్థానం కోల్పోవడం తెలిసిందే. టోర్నీ మధ్యలో అవమానకర పరిస్థితుల్లో వార్నర్ ను తప్పించారంటూ అప్పట్లో వ్యాఖ్యలు వినిపించాయి. అయితే ఆర్సీబీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నాడని, రానున్న సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు డేవిడ్ భాయ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడన్నట్లు…