ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో తమ వద్ద ఉన్న బంగారాన్ని తనఖా పెట్టి లోన్ తీసుకుంటారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లోన్స్ అందిస్తుంటాయి. అయితే తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ లోన్స్ పై కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. రుణగ్రహీతలు ఇప్పుడు తాకట్టు పెట్టిన బంగారం విలువలో 85%కి సమానమైన రుణాలను పొందవచ్చని తెలిపింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా రూ. 2.5 లక్షల కంటే తక్కువ ఉన్న బంగారు రుణాలపై ఉపశమనం ప్రకటించారు. Also…