భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి ఉన్న ప్రాముఖ్యత, ప్రాశస్త్యం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ...రెండు రాష్ట్రాల మధ్య ఉన్న, నలుగుతున్న ఆలయ భూముల గురించి మాత్రం రామయ్య భక్తగణంలో తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతోంది. ఈ విషయంలో రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న వైఖరి ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంది.