చిత్రసీమలో అడుగుపెట్టగానే ‘తండ్రికి తగ్గ తనయుడు’ అనిపించుకున్నారు రామ్ చరణ్. ఇప్పుడు ‘ట్రిపుల్ ఆర్’తో గ్లోబల్ స్టార్ గానూ జేజేలు అందుకుంటున్నారు చరణ్. నటనిర్మాతగానూ తన అభిరుచిని చాటుకుంటున్న రామ్ చరణ్, ఈ నాటి నటవారసుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు రామ్ చరణ్. మరో నటవారసుడు జూనియర్ యన్టీఆర్ తో కలసి ఈ మధ్యకాలంలో రూపొందిన అసలు సిసలు మల్టీస్టారర్ ‘ట్రిపుల్ ఆర్’లో నటించారు చెర్రీ. ఇందులో తారక్ తో కలసి చెర్రీ చిందేసిన తీరు…