సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో రామ్ చరణ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ స్టార్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుని అద్భుతమైన నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. చిరుత, మగధీర, ధృవ, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో తన నటనలో సత్తా చాటాడు. ఇక డ్యాన్స్ లోనూ తిరుగు లేదన్పించిన చెర్రీ ఎంతోమంది ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నారు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’తో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 36వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇప్పుడు ఏ విషయం ఉన్నా, విశేషమైన సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం, విష్ చేయడం ట్రెండ్ గా మారింది. అదే ట్రెండ్ ను ఫాలో అవుతూ సెలెబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగానే తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఏదైనా మంచి వార్త అయితే విష్ చేస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో చరణ్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజుల నేడు. “ఆర్ఆర్ఆర్”ను బ్లాక్ బస్టర్ హిట్ చేసి చెర్రీకి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు ప్రేక్షకులు. ఇక పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులతో సెలెబ్రిటీలు, రామ్ చరణ్ సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ యంగ్ హీరో నేడు సీతారామరాజుగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల మదిలో చెరిగిపోని ముద్ర వేశాడు.…
(మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే)ఈ నాటి నటవారసుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు రామ్ చరణ్. తండ్రి చిరంజీవికి తగ్గ తనయుడు అనిపించుకుంటూనే, తనదైన బాణీ పలికిస్తున్నారు చరణ్. నటనిర్మాతగా తన అభిరుచిని చాటుకుంటున్నారు. తండ్రి కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’తో నిర్మాతగా మారిన రామ్ చరణ్, తరువాత తండ్రితోనే ‘సైరా…నరసింహారెడ్డి’ సినిమాను అత్యంత భారీ వ్యయంతో నిర్మించారు. ఇప్పుడు నాన్నతో కలసి నటిస్తూ ‘ఆచార్య’ చిత్ర నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.…