Mithun Manhas: మిథున్ మన్హాస్ BCCI కొత్త అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మొదట తన ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్‌లో ఈ నియామక వార్తను పంచుకున్నారు. మిథున్ మన్హాస్ అధికారికంగా BCCI అధ్యక్షుడిగా నియమితులైనట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే.. గత కొన్ని రోజులుగా మిథున్ మన్హాస్ పేరు ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 28న ముంబైలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) ముగిసిన తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా మన్హాస్ అధికారికంగా నియమితులయ్యారు.