స్టాండ్ ఆప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ షో ను అడ్డుకుంటామని ఇప్పటికే మా కార్యకర్తలు ఆన్లైన్ లో టికెట్ లు తీసుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచళన వ్యాఖ్యలు చేసారు. షో లోపలే మునావర్ ఫరూకీ పై దాడి చేస్తామని వెల్లడించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తితే, డీజీపీ, ప్రభుత్వం బాధ్యత వహించాలని రాజాసింగ్ తెలిపారు. బీజేపీ పార్టీ నాయకులు వద్దన్నా.. నేను షోను అడ్డుకుని తీరుతా అంటూ మండిపడ్డారు. ధర్మం కన్నా.. నాకు పార్టీ…
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటనతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవైపు కోవిడ్ నిబంధనలు, మరోవైపు బీజేపీ క్యాండిల్ ర్యాలీ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో బీజేపీ ర్యాలీకి అనుమతిలేదని అధికారికంగా పోలీసులు ప్రకటించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో మౌనంగా ర్యాలీ తీస్తామని బీజేపీ శ్రేణులు ప్రకటించాయి. సికింద్రాబాద్ గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్ వరకు ర్యాలీ చేపడతామని బీజేపీ తెలిపింది. దీంతో సికింద్రాబాద్ లో భారీగా పోలీసులు మోహరించారు.
ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నుమాయిష్ (నాంపల్లి ఎగ్జిబిషన్)కు అటంకాలు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నాంపల్లి ఎగ్జిబిషన్‌కు అనుమతులు ఇవ్వకపోవడంతో సోసైటి సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు విచారణ చేపట్టిన హైకోర్టు కోవిడ్ నిబంధనలతో అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎగ్జిబిషన్‌కు అనుమతులు ఇవ్వవద్దని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలో కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోందని, దేశంలో చాలా రాష్ట్రాలు నూతన సంవత్సర వేడుకలకు…
రైతులు ఇబ్బందులు పడుతుంటే రాజకీయాల వారిపైనే కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 500,1000 రూపాయలు ఇచ్చి కిరాయి గుండాలతో TRS నేతలు బండి సంజయ్ వెహికిల్ పై రాళ్ళ దాడి చేశారని ఆయన అన్నారు. బీజేపీ కార్యకర్తలు దీటుగా ఎదుర్కొని టీఆర్‌ఎస్ కార్యకర్తలకు, గుండాలకు సరైన సమాధానం చెప్పారన్నారు. రైతులను కాపాడాల్సిన ముఖ్యమంత్రి, రైతులను మోసం చేస్తున్నాడు. హుజూరాబాద్ ఎలక్షన్ లో TRS ఓటమిని తట్టుకోలేక…
దీపావళి సందర్భంగా పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినందున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. పెట్రో ల్, డీజిల్ ధరల పెరుగుదలను అడ్డం పెట్టుకుని తెలంగాణ ప్రభు త్వం కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుందని ఆయన గుర్తు చేశారు. విమర్శించడం సులభమే.. కానీ ఆచరణలో పాటించడానికి బలముండాలన్నారు. పెట్రోల్‌పై రూ.41 పన్ను వసూలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రూ.8 నుంచి రూ.10 తగ్గించాలని…
బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం ఎమ్మెల్యే రాజాసింగ్ అధ్యక్షతన సోమవారం జరిగింది.ఈ సందర్భంగా ఆయన కేసీఆర్‌పై విమర్శలు సంధించారు. ప్రధానంగా హుజురాబాద్ ఉప ఎన్నికపైనే ఈ సమావేశం జరిగినట్టు ఆయన వివరించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయ త్నాలు కేసీఆర్ చేశారన్నారు. సర్వేల ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాజాసింగ్ విమర్శించారు. కేసీఆర్ ఎన్ని సర్వేలు చేయించుకున్నా బీజేపీ గెలుస్తుందని రిపోర్ట్ రావడంతో చివరకు డబ్బులు పంచి గెలవాలని చూశాడని…
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీ అధికారంలోకి రాగానే ఎంఐఎం దొంగలను పాకిస్తాన్ కు పంపిస్తామని హెచ్చరించారు రాజా సింగ్. మోడీ దెబ్బకు జనగణమన పాడుతున్నారని తెలిపారు. ఏ పార్టీ అధికారం లో ఉంటే ఆ పార్టీ కి ఎంఐఎం పార్టీ వత్తాసు పలికుతుందని ఫైర్ అయ్యారు. రేపు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ పార్టీనేనని… ఏమి చేస్తారో ఇప్పుడే ఆలోచించుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. ఛార్మినార్ దగ్గర…
హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్రలో అస్వస్థతకు గురైన బీజేపీ నేత ఈటల రాజేందర్… వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు.. పాదయాత్ర ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్టు ఈటల ప్రకటించారు.. మరోవైపు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈటలను ఇప్పటికే పలువురు నేతలు పరామర్శించగా.. ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రాఘునందర్‌రావు పరామర్శించారు.. ఆయన ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇక, ఆస్పత్రిలో ఈటలను పరామర్శించిన తర్వాత మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్… ఈటల ఆరోగ్య…