కట్టుతప్పుతున్న భూతాపం, వాతావరణ మార్పుల మూలంగా ఇటీవల కుండపోత వానలు విరుచుకుపడుతున్నాయి. వాటివల్ల విపరీతమైన జనసాంద్రత కలిగిన భారతీయ నగరాలు వరదల గుప్పిట చిక్కి విలవిల్లాడుతున్నాయి. రోడ్లపైకి భారీగా వాననీరు చేరి కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయి స్థానికులు నరకం అనుభవిస్తున్నారు.