Central Cabinet Meeting: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అనేక ప్రాజెక్టులపై చర్చించి వాటికి అనుమతులిచ్చారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రాజెక్టులకు పెద్దపీట వేసింది కేంద్రం. ఇందులో భాగంగా ఎప్పుడు నుంచో పెండింగ్‌లో ఉన్న తిరుపతి – కాట్పాడి రైల్వే లైన్…