అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై సుంకాలను ప్రకటించిన తర్వాత కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ట్రంప్ చర్యను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. “ఇటీవలి రోజుల్లో, రష్యా నుంచి భారతదేశం చేసుకునే చమురు దిగుమతులను అమెరికా లక్ష్యంగా చేసుకుంది. మా చమురు దిగుమతులు మార్కెట్ ఆధారితమైనవి. 140 కోట్ల మంది భారతీయుల ఇంధన భద్రతను నిర్ధారించడం దాని ప్రధాన లక్ష్యం అనే విషయంతో సహా ఈ అంశాలపై మేము ఇప్పటికే మా వైఖరిని స్పష్టం చేసాము.…