Bus Conductor Radha : చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం అనేక కుటుంబాలను శోకసంద్రంలో ముంచేసింది. ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ బస్సు కండక్టర్ రాధ ఆ భయానక ఘటనను కన్నీళ్లతో గుర్తుచేసుకున్నారు. కండక్టర్ రాధ మాట్లాడుతూ.. “అంతా క్షణాల్లో జరిగిపోయింది. టిప్పర్ చాలా వేగంగా వస్తున్నదని నేను, మా డ్రైవర్ గమనించాము. డ్రైవర్ బస్సును కిందకు తిప్పే ప్రయత్నం చేశాడు.. అలా చేయకపోయి ఉంటే ఇంకా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయేవారు” అని చెప్పారు.…