Putin: రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే గత రెండు దశాబ్ధాలుగా పుతిన్ రష్యాకు అధ్యక్షుడిగా ఉన్నారు. సోవియట్ అధ్యక్షుడిగా ఎక్కువ కాలం పనిచేసిన స్టాలిన్ రికార్డును కూడా పుతిన్ బద్ధలు కొట్టారు. తాజాగా అక్కడి శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 17న అధ్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ రోజు రష్యా కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై సమావేశమైంది.