ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన కథానాయికగా నటిస్తుండగా.. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా చిత్రీకరణ మంగళవారం పునఃప్రారంభమైంది. అయితే తాజాగా ఓ కీలక పాత్రలో నటిస్తున్న ప్రముఖ యాంకర్ అనసూయ గురువారం నుంచి షూటింగ్ కు హాజరైంది. ఈ లాంగ్ షెడ్యూల్ లో పుష్ప చిత్రబృందం షూటింగ్ కు ప్యాకప్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్…