పుష్ప 2 థాంక్స్ మీట్ లో పుష్ప సినిమా గురించి సునీల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ తాను ఒక సినిమా షూటింగ్ కోసం స్పెయిన్ వెళ్లానని అక్కడ రాత్రి పది అయితే షాప్స్ అన్ని క్లోజ్ అయిపోతాయని తెలిసిందని అన్నారు. తిండి కూడా దొరకపోవడంతో ఎంతో ప్రయత్నించిన తరువాత దగ్గర్లో ఒక కబాబ్ సెంటర్ ఉందని తెలిసిందని ఆ కబాబ్ అనే పదం ఇండియాదే కాబట్టి అక్కడ ఇండియన్స్…