ఇటీవల కాలంలో దేశంలో ఐవీఎఫ్ విధానం బాగా పాపులర్ అయింది. పిల్లలు లేనివారు ఈ పద్దతి ద్వారా పిల్లను కంటున్నారు. అండాలను, శుక్రకణాలను సేకరించి ప్రత్యేక పద్దతితో ల్యాబ్‌లో ఫలదీకరణం చేసి ఆ తరువాత అ అండాన్ని వేరొకరి గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. అక్కడ అండం పిండంగా మారుతుంది. ఇప్పుడు ఈ కృత్రిమ పద్దతి విధానాన్ని అరుదైన జంతువుల జాతిని పెంచేందుకు కూడా వినియోగిస్తున్నారు. దేశంలో అత్యంత అరుదైన జాతికి చెందిన పశువుల్లో పుంగనూరు జాతి ఆవులు కూడా…