Maharashtra: పెను ప్రమాదం తప్పింది. గుర్తుతెలియన వ్యక్తుల రైలుని పట్టాలను తప్పించేందుకు కుట్ర పన్నారు. ఈ ఘటన శుక్రవారం మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పూణే-ముంబై రైల్వే ట్రాకుపై పెద్ద బండరాళ్లను రైల్వే అధికారులు గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఉద్దేశపూర్వకంగా దుండగులు రైలును పట్టాలు తప్పించే ప్రయత్నం చేశారని రైల్వే అధికారులు చెప్పారు.