Bangladesh: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మరోసారి భారీ నిరసనలు చెలరేగాయి. తీవ్రవాద భావజాలం, భారత్‌కు వ్యతిరేక వ్యాఖ్యలు చేసే నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది మరణించారు. అనంతరం.. వేలాది మంది షాబాగ్ ప్రాంతంలో గుమిగూడారు. నినాదాలు చేస్తూ, ప్లకార్డులు పట్టుకుని నిరసనకారులు హాది భద్రతలో అధికారుల వైఫల్యమే కారణమని ఆరోపించారు.