నెల్లూరు జిల్లాలో జనసేనకు ఒక స్థానం కూడా కేటాయించకపోవడంతో జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. జిల్లాకు సీటు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా.. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ.. జనసేన పార్టీ కోసం గత ఆరు సంవత్సరాల నుంచి నేతలు, కార్యకర్తలు ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఉన్నారని తెలిపారు. ఈ పోరాటాలతోనే పార్టీని బలోపేతం చేసుకున్నామన్నారు. కరోనా సమయంలో ఎవరూ చేయని విధంగా…