యువ చిత్ర పతాకంపై అత్యద్భుతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటు. చక్రపాణి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, మహాకవి శ్రీశ్రీ, పాలగుమ్మి పద్మరాజు వంటి సాహితీ ప్రముఖులతో ఉన్న అనుబంధమే మురారికి కథాబలం ఉన్న చిత్రాల నిర్మాతగా ఖ్యాతిని సంపాదించి పెట్టింది. చిన్నతనం నుండి సంగీతం, సాహిత్యం మీద ఉన్న మక్కువే ఆయన నిర్మించిన చిత్రాలు కలకాలం ప్రేక్షకుల మదిలో నిలిచి ఉండటానికి కారణమైంది. సినిమా రంగం మీద మక్కువ……