వరిధాన్యం, బియ్యం సేకరణపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. వరిధాన్యం కొనుగోలుపై లోకసభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి సమాధానం ఇచ్చారు. 2018-19 లో ఆంధ్ర ప్రదేశ్ నుంచి 48.06 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించగా, తెలంగాణ నుంచి 51.90 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినట్లు వివరించారు. 2019-20లో ఏపీ నుంచి 55.33 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం,…