కరోనా మహమ్మారి మరో ప్రతిభావంతుడైన తెలుగు దర్శకుడిని పొట్టనపెట్టుకుంది. వరుణ్ సందేశ్ హీరోగా ‘ప్రియుడు’ చిత్రాన్ని రూపొందించిన శ్రావణ్ శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. వి.ఎన్. ఆదిత్య ‘మనసంత నువ్వే’, ‘శ్రీరామ్’; శోభన్ ‘వర్షం’ చిత్రాలకు అసోసియేట్ దర్శకుడిగా పనిచేసిన శ్రవణ్ ఆ తర్వాత ‘ప్రియుడు’తో దర్శకుడిగా మారారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో తిరిగి కో-డైరెక్టర్ గా, రచయితగా తన కెరీర్ ను కొనసాగించారు. శంకర్ కె. మార్తాండ్ దర్శకత్వంలో శరత్ మరార్…