కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌తో ప్రైవేట్ స్కూళ్లు మూతపడడంతో.. ప్రైవేట్ టీచర్లను, సిబ్బందిని ఆదుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రైవేట్ స్కూళ్ల టీచర్లకు నెలకు రూ. 2000లు, కుటుంబానికి 25 కిలోల బియ్యం చొప్పొన అందించనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించిన విద్యాశాఖ అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేశారు. అయితే ప్రభుత్వమందించే ఈ ఆపత్కాలపు ఆసరాకు లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. మొత్తం 1,18,004…