Sangareddy: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి దశాబ్దం ముగిసింది. అయినా కొన్ని గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలకు రోడ్లు లేకపోవడం మన నాయకులు చెత్త పాలనకు అద్దంపడుతోంది. గిరిజన గ్రామాల్లో సైతం రోడ్డు సౌకర్యాలు లేక ఆ గిరిజనులు పడుతున్న నరకయాతన వర్ణనాతీతం. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అలాంటి ఓ తండా వెలుగులోకి వచ్చింది.