యన్టీఆర్, ఏయన్నార్ బాక్సాఫీస్ బరిలో ఢీ అంటే ఢీ అని పోటీ పడ్డా, నిజజీవితంలో సోదరభావంతోనే సాగారు. వారి మధ్య పొరపొచ్చాలు తలెత్తినా, అవి టీ కప్పులో తుఫానులాంటివే. వారి అనుబంధానికి నిదర్శనంగా పలు అంశాలు జనం ముందు నిలుస్తాయి. ఒకప్పుడు యన్టీఆర్ కు అంటూ కొందరు, ఏయన్నార్ కు మరికొందరు ప్రత్యేక నిర్మాతలు ఉండేవారు. వాళ్ళు తమ హీరోలతోనో, లేదా తరువాతి తరం హీరోలతోనో సినిమాలు తీసేవారు తప్పితే, ఆయన నిర్మాత ఈయనతో, ఈయన నిర్మాత…