బుడమేరు గండ్లు పడిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. మూడు గండ్లు పూడ్చిన విధానాన్ని మంత్రి నిమ్మల, ఇరిగేషన్ అధికారులు సీఎంకు వివరించారు. గండ్ల పటిష్టతకు తీసుకుంటున్న చర్యలను మంత్రి సీఎంకి తెలిపారు. భవిష్యత్తులో కూడా బుడమేరు డైవర్షన్ కెనాల్, బుడమేరు కాల్వ వల్ల నగరానికి ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.