దక్షిణ భారత సినిమా మరోసారి అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను చాటుకుంది. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2025 ఈసారి దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్, ఎక్స్‌పో సిటీలో ఘనంగా నిర్వహించబడింది. లైట్ల తళుకులు, గ్లామర్, సంగీతం, డ్యాన్స్‌లతో స్టార్ పవర్ నిండిన ఈ వేడుకలో దక్షిణ భారత సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు ఒకచోట చేరారు. మొదటి రోజు ప్రత్యేకంగా తెలుగు సినిమాకి అంకితం చేయబడింది. టాలీవుడ్‌కి చెందిన నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు,…