అసలు ప్రభాస్ లైనప్ చూస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కాల్సిందే. బాహుబలి సినిమా పై ఎంత నమ్మకంతో ఐదేళ్ల సమయాన్ని కేటాయించాడో… అంతకు మించిన స్టార్ డమ్ ని ప్రభాస్ అందుకున్నాడు. అందుకే ఈ పాన్ ఇండియా కటౌట్‌పై వేల కోట్లు కుమ్మరిస్తున్నారు మేకర్స్. ఇక డార్లింగ్ కూడా ఒకసారి కమిట్ అయితే ఎంత వరకైనా వెళ్తాడు. అందుకే బాహుబలి తర్వాత పాన్ ఇండియా క్రేజ్ వచ్చినప్పటికీ, ఇచ్చిన మాట కోసం సుజీత్‌తో సాహో, రాధాకృష్ణతో రాధే శ్యామ్ సినిమాలు…