యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హస్తసాముద్రికుడిగా కనిపించబోతున్న చిత్రం “రాధే శ్యామ్” విడుదల కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రంతో దాదాపు రెండున్నరేళ్ల విరామం తర్వాత ప్రభాస్ థియేటర్లలోకి రాబోతున్నాడు. జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ‘రాధే శ్యామ్’ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్, తమన్…