మూసీ బాధితులకోసం బీజేపీ నేడు హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ చౌక్ వద్ద మహా ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ధర్నాలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేఎల్పీ నేత ఏలేటి మాహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత ఏలేటి మాహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మీ హయాంలోనే ఆ ఇండ్లకు అనుమతి ఇచ్చారు.. ఇప్పుడు ఎలా అక్రమమయ్యాయో రేవంత్ సమాధానం చెప్పాలన్నారు. మూసీ సుందరీకరణను ఏటీఎం లాగా మార్చుకోవాలనుకుంటున్నారా అని ఆయన…