సినిమాల ప్రభావం ప్రేక్షకులపై ఎంతగానో ఉంటుంది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో పలువురిని ప్రభావితం చేస్తాయి. అలా జ్యోతిక నటించిన 2020 కోర్టు డ్రామా ‘పొన్మగల్ వందాల్’ ఈ కోవకే చెందుతుంది. ఈ సినిమా చూసి తమిళనాడులో తొమ్మిదేళ్ల అత్యాచార బాధితురాలు 48 ఏళ్ల బంధువు వల్ల లైంగిక వేధింపులకు గురైనట్లు కుటుంబ సభ్యులకు వెల్లడించింది. దాంతో వారు నిందితుడిపై ఫిర్యాదు చేశారు. మద్రాస్ హైకోర్టు కోర్టు అతనికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిని జ్యోతిక సోషల్ మీడియాలో…
ఏ సినిమా చూసిన నీతి సారం మాత్రం చెడుపై మంచి గెలవడమే.. ప్రతి సినిమా ముగింపు సమాజ హితం కోసమేనని ఇప్పటికే చాలా సినిమాలు చూపించాయి. అందుకే సినిమా స్టార్స్ కి అంతటి క్రేజ్ ఉంటుంది. వాళ్లే బయట చెప్పే మాటలకు కూడా అంత ప్రభావం ఉంటుంది. అయితే తాజాగా ఓ సినిమా సీన్ తో తొమ్మిదేళ్ల చిన్నారి తన నిశ్శబ్దాన్ని బద్దలుకొట్టిన తీరు నటి జ్యోతిక మనసును గెలిచింది. నటి జ్యోతిక తొలిసారి లాయర్ పాత్రలో…