గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు మరోసారి దారుణానికి తెగబడ్డారు. బాంరగడ్ తాలుక జూవి గ్రామానికి చెందిన పూసు పుంగంటి (52) అనే వ్యక్తిని మావోలు గొంతు కోసి హత్య చేశారు. సమాచారం మేరకు, ఓ వివాహ వేడుకకు వెళ్లిన పూసు పుంగంటిని మావోయిస్టులు కిడ్నాప్ చేసి, అనంతరం హత్య చేశారు. అతను పోలీసులకు సహకరిస్తున్నాడనే అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ…