కేరళలో కాంగ్రెస్ మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నాయకుడు వివాదాస్పద ప్రకటన చేశారు. మహిళలు, పురుషులు సమానం కాదని ముస్లిం లీగ్ కేరళ విభాగం ప్రధాన కార్యదర్శి పీఎంఏ సలాం అన్నారు. స్త్రీలను, పురుషులను సమానంగా పిలవడం వాస్తవికతకు వ్యతిరేకమన్నారు. అంటే ప్రస్తుత సమాజంలో ఆడ-మగ సమానత్వం లేదని ఆయన అభిప్రాయం.