జీ7 సదస్సు కోసం ఇటలీ వెళ్లిన ప్రధాని మోడీ.. శుక్రవారం బిజిబిజీగా గడిపారు. పలు దేశాల అధినేతలతో సమావేశం అయ్యారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.
ఇటలీలో జరుగుతున్న జీ 7 సమ్మిట్ ఆద్యంతం సందడి.. సందడిగా సాగుతోంది. అగ్ర నేతలంతా ఇటలీలో ప్రత్యక్షమయ్యారు. దీంతో ఒకరినొకరు పలకరించుకుంటూ ఉత్సాహంగా సాగుతున్నారు. ఇక ప్రధాని మోడీ.. ఆయా దేశాధినేతలతో సమావేశం అయ్యారు.