Bus Accident: ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీకి వెళ్తున్న బీజేపీ కార్యకర్తల బస్సు ప్రమాదానికి గురైంది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు బీజేపీ కార్యకర్తలు మృతి చెందగా, మరో 5 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.