ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనాకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈరోజు అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను కలిశారు. టియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి ముందు ఈ సమావేశం జరిగింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఉత్తర చైనాలోని టియాంజిన్‌లో జరిగే SCO శిఖరాగ్ర సమావేశానికి ప్రధానమంత్రి హాజరవుతారు. ఇద్దరు నాయకుల సమావేశం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు) ప్రారంభమైంది.…
Modi Xi Jinping Meeting: భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటన ముగించుకుని చైనా చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం మోడీ చైనాలోని టియాంజిన్ నగరానికి చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో ప్రధాని మోదీ విమానం దిగినప్పుడు, ఆయనకు రెడ్ కార్పెట్ పరిచి చైనాకు చెందిన పలువురు సీనియర్ దౌత్యవేత్తలు ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు అనేక మంది చైనా మహిళా కళాకారులు నృత్యం చేస్తూ కనిపించారు. చైనా చేరుకున్న తర్వాత ప్రధాని మోదీ…