పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ‘పీఎఫ్ 3.0’ పేరుతో కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఉద్యోగుల భవిష్య నిధి (EPF) వ్యవస్థను మరింత డిజిటల్‌గా, సులభతరంగా మార్చడమే లక్ష్యమని కేంద్రం తెలిపింది. కొత్త నిబంధనలతో పీఎఫ్ ఉపసంహరణ ప్రక్రియ మరింత త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఆన్‌లైన్ సేవలు మరింత మెరుగవడంతో ట్రాన్స్‌ఫర్‌లు, క్లెయిమ్‌లు, బ్యాలెన్స్ వివరాలు తక్షణమే తెలుసుకునే విధంగా వ్యవస్థను అప్‌గ్రేడ్ చేయనున్నారు. దీంతో పీఎఫ్ ఖాతాదారులకు మరింత సౌలభ్యం,…