మనదేశంలో తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా పండించే ఆహారపు పంటలల్లో వరి కూడా ఒకటి.. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో కోత దశలో ఉంది.. చలికాలం మంచు కారణంగా వరిపైరులో చీడపీడల ఉధృతి పెరిగింది. వీటిని సకాలంలో అరికట్టకపోతే తీవ్రనష్టం వాటిల్లే ప్రమాదముందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.. నీటి వసతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వరిని పండిస్తున్నారు.. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో దుబ్బు దశ నుండి కంకిపాలుపోసుకునే దశ వరకు ఉంది.…