ఆయన అధికారపార్టీ ఎమ్మెల్యే. కీలక నియోజకవర్గంలో గెలిచారు. ఇక తనకు తిరుగే లేదని అనుకున్నారో ఏమో.. క్షేత్రస్థాయిలో సీన్ రివర్స్. కేడర్‌నే కంట్రోల్ చేయలేకపోతున్నారట. పైగా ఒక వర్గాన్ని వెనకేసుకొస్తున్నారని ఆరోపణలు. ఇకేముందీ.. రెండోవర్గం టైమ్ కోసం ఎదురు చూస్తోందని ఒక్కటే గుసగుసలు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఎమ్మెల్యేపై వైసీపీలోని మరోవర్గం గుర్రు..! కొఠారు అబ్బయ్య చౌదరి. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ కోటను వైసీపీ గాలిలో బద్దలుకొట్టి ఎమ్మెల్యేగా గెలిచారు.…