ఉభయ తెలుగు రాష్ట్రాల నేతలు హస్తిన బాట పట్టారు.. త్వరలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు.. ఈలోపే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు.. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానం మేరకు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఇవాళ ఢిల్లీ చేరుకున్నారు.. మొదట ప్రహ్లాద్ జోషితో సమావేశంకానున్న ఆయన.. ఆ తర్వాత తన పర్యటనలో పలువురు బీజేపీ ముఖ్యనేతలతో భేటీ అవుతారని తెలుస్తోంది.…