బెజవాడ దుర్గమ్మకు శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున పట్టువస్త్రాలను అందజేశారు. శ్రీకాళహస్తి ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ మర్యాదలతో దుర్గగుడి ఈవో కె.ఎస్.రామారావు స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి ఆలయ ఈవో బృందానికి వేద పండితులు వేదాశీర్వచనం చేశారు.